కేసిఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

కేసిఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేసిఆర్  ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేశామని జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల పట్టణం లో జగిత్యాల రూరల్ తహసిల్దార్ కార్యాలయం లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముభారాక్ ద్వారా మంజూరైన రూ. 21. 4 లక్షల  చెక్కులను జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ తో కలిసి ఎమ్మేల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ లో అధికారులు స్టేజి పై ఫ్లెక్సీ పెట్టక పోవడం,అధికార పార్టీ నాయకుల వొత్తిడి ప్రధాన కారణమన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం లో నేను స్వయంగా మహిళల కు ఇచ్చే చీర కానుకను యాదావిదిగా కొనసాగిస్తామని, డిశంబర్ 9 నుండి పెళ్లి అయిన మహిళలు అందరికీ శుభ మస్తు పథకం ,తులం బంగారం అమలు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తాం అన్నారు అమలు చేయాలని,డిగ్రీ చదివే ప్రతి మహిళ కు స్కూటీ,నిరుద్యోగులకు నిరుద్యోగులకు బృతీ  అమలు పై స్పందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, దామోదర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సర్పంచులు చెరుకు జాన్, తిరుపతి,ప్రవీణ్,మహేశ్వర రావు,సరోజన మల్లారెడ్డి,సత్తమ్మ గంగారాం,తిరుపతి, గంగ నర్సు రాజన్న,మమత సతీష్,ప్రభాకర్,అంజయ్య,స్వప్న రాజేశ్వర రెడ్డి,నారాయణ,ఎంపీటీసీ లు లక్ష్మి శంకర్,సురేందర్ రెడ్డి,పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్,తదితరులు పాల్గొన్నారు.