వెల్గటూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటింటి ప్రచారం...    

వెల్గటూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటింటి ప్రచారం...    

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గ లో గల వెల్గటూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిం aచారు.  ఈసందర్బంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గ్రామంలో గల ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మరొక ఐదు సంవత్సరాల కాలం వెనుకకు వెళ్తుందని తెలిపారు . ఒక్క సారి అవకాశం కోసం ఇవ్వాలని కాంగ్రెస్  నాయకులు ఆపడ మొక్కులు మొక్కుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పది అవకాశాలు ఇచ్చారని, కాని వారు పదవులను అనుభ వించారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణ పక్కనె ఉన్న కర్ణాటక రాష్టం లో 
 అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడి రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని అన్నారు. అక్కడి ప్రజల అవసరాలకు సరిపడినంత విద్యుత్ అందించడం  లేదని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రైతులు, ప్రజలు తిరగబడి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుందని, అటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మీ పైనె ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లూరి రాంచం దర్ గౌడ్, జూపాక కుమార్, జడ్పిటిసి బి సుధారాణి,  నాయకులు పత్తిపాక వెంకటేష్,  గండ్ర విష్ణువర్ధన్ రావు, రంగు తిరుపతి, కొప్పుల సురేష్, పెద్దూరి భరత్,  మూగల సత్యం, భూసర్తి గంగారం  తదితరులు పాల్గొన్నారు.