లియో క్లబ్ ఆఫ్ బాలభారత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

లియో క్లబ్ ఆఫ్ బాలభారత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: లయన్స్ క్లబ్ హైదరాబాద్ నవభారత్  ఆధ్వర్యంలోని లియో క్లబ్ ఆఫ్ బాలభారత్ నూతన కార్యవర్గ పదవీ స్వీకార కార్యక్రమం శుక్రవారం నాడు హైదర్ గూడలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది.  కె. విశ్వనాథ్ అధ్యక్షుడుగాను,  జి గీతిక కార్యదర్శిగాను, టి పవన్ కోశాధికారిగాను ప్రమాణ స్వీకారం చేశారు. 

లయన్స్ క్లబ్ ఉన్నత స్థాయి నాయకులు గోవిందరాజు, యాదయ్య గౌడ్, దిలీప్ కులకర్ణి, సి హెచ్ గోపాలకృష్ణ, బి వినయ్, జీవీకే శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మైలీ డెంటల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించారు.