ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

ముద్ర ప్రతినిధి, జనగామ : తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆ సంఘం లీడర్లు డిమాండ్‌ చేశారు. తమను పర్మినెంట్‌ చేయాలని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆదివారం వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియంలో ఆత్మ గౌరవ సభలో నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థ ను రద్దు చేసి రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని, అసెంబ్లీలో ప్రతిపాదించిన పీఆర్‌‌సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి జనగామ జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు రాజేష్, కార్యదర్శి కనకరాజు, సంయుక్త కార్యదర్శి అన్నం సత్యపాల్, అన్ని శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.