బహుజన్ ముక్తి పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లేటి రమేష్ కుమార్

బహుజన్ ముక్తి పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లేటి రమేష్ కుమార్
  • మంచం గుర్తుకు ఓటేసి బహుజన ఉద్యమానికి పునాది వేయాలని పిలుపునిచ్చిన పల్లెటి 

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-దేశంలో తృతీయ ఫ్రెంట్ గా భారత్ ముఖ్యమోచ జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రాం  చైర్మన్ గా ఏర్పడిన రాష్ట్రీయ పరివర్తన మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణలో " సామాజిక తెలంగాణ  పొలిటికల్ ఫ్రంట్ " బలపరిచిన బహుజన ముక్తి పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లెటి రమేష్ కుమార్ ఎంపిక చేసినట్లుగా ఫ్రంట్  చైర్మన్ దాసరి అజయ్ కుమార్  హైదరాబాదులో ప్రకటించారనీ పల్లెటి రమేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పల్లేటి రమేష్ కుమార్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన బహుజనముక్తి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి , సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో బహుజన బిడ్డల ఎదుగుదలకు అడ్డుపడుతున్నటువంటి మనువాద రాజకీయ పార్టీలను అనగదొక్కడానికి  బహుజన ముక్తి పార్టీ ఏర్పడిందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లందరూ మాయ మాటలు చెప్పే ఆయా రాజకీయ పార్టీల మైకంలో పడ్డారని,  వారిలో  చైతన్యం తీసుకొచ్చి సూర్యాపేటలో బహుజన ముక్తి పార్టీ జెండా ఎగరవేస్తానని అన్నారు .అభివృద్ధి అంటే అంతస్తులు కాదని వ్యక్తి ఎదుగుదలలో ఉండాలని,,  విద్య వైద్యం గురించి ఎక్కడ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయాలేదని అన్నారు. విద్య వైద్యం లేనటువంటి మేనిఫెస్టో మనిషి భవిష్యత్తును ఏ విధంగా తీర్చి దిద్దుతుందో చెప్పాలని రాజకీయ పార్టీలకు సవాలు విసిరారు. కచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కల్లబొల్లి మాటలను ప్రతి బహుజన బిడ్డకు అర్థమయ్యేలా తెలియజేసేలా ప్రతి గ్రామానికి వెళ్లి బహుజన ముక్తి పార్టీ చైతన్య పరుస్తుందని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ప్రజలందరు మంచం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని పల్లేటి రమేష్ కుమార్ కోరారు.