ఆర్‌‌ఎంపీల సేవలు గొప్పవి: కల్నల్‌ డాక్టర్‌‌ మాచర్ల భిక్షపతి

ఆర్‌‌ఎంపీల సేవలు గొప్పవి: కల్నల్‌ డాక్టర్‌‌ మాచర్ల భిక్షపతి

ముద్ర ప్రతినిధి, జనగామ: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌‌ఎంపీలు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో గొప్పవని, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వారు అప్‌డేట్‌ కావాలని కల్నల్‌ డాక్టర్‌‌ మాచర్ల భిక్షపతి సూచించారు. శనివారం నేషనల్‌ డాక్టర్స్‌ డేను పురస్కరించుకుని జనగామ మండలం వెంకిర్యాలలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న 25 మంది ఆర్‌‌ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌‌ భిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌‌ఎంపీల సేవలు మరువలేమన్నారు. అయితే వారు మూస ధోరణిలో కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్‌ కావాలన్నారు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో ట్రీట్‌మెంట్‌ అందించి, అవసమైతే మెరుగైన వైద్య సేవల కోసం పెద్దాస్పత్రులకు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా సీఆర్‌‌పీ, ఎమర్జెన్సీ మందలు వాడకంపై కల్నల్‌ ఆర్‌‌ఎంపీలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీనారాయణ, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు కన్నా పర్శరాములు, అడ్వకేట్‌ ప్రసాద్‌రావు,  మాశెట్టి సంతోష్,  జైన రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.