ఈ నెల 19న పెద్దపల్లికి రాహుల్ గాంధీ రాక...

ఈ నెల 19న పెద్దపల్లికి రాహుల్ గాంధీ రాక...
  • సభా స్థలిని పరిశీలిస్తున్న ఏఐసీసీ అగ్ర నేతలు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఈనెల 19న పెద్దపెల్లి కి ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 19వ తేదీన గురువారం రోజున జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు అగ్ర నేత  రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.  బహిరంగ సభా స్థలిని సోమవారం  ఏఐసిసి అగ్ర నాయకులు రోహిత్ చౌదరి, సుషాంత్ మిశ్రా, వేం నరేందర్ రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు, ప్రభుత్వ కాలేజీలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్దపెల్లి జిల్లాతో పాటు మంచిర్యాల్, కరీంనగర్, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో నుంచి భారీ ఎత్తున ప్రజలు రానున్న సందర్భంగా  ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ గాంధీ సభను అధిక సంఖ్యలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రామణరావు కోరారు.