రాహుల్​గాంధీ న్యూలుక్​

రాహుల్​గాంధీ న్యూలుక్​

గతేడాది సెప్టెంబరులో భారత్ జోడో యాత్ర  ప్రారంభమైనప్పటి నుంచి నెరిసిన జుట్టు, మాసిన గడ్డంతో కనిపించిన కాంగ్రెస్  అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ  తాజాగా స్టైల్ మార్చారు. ఇన్నాళ్లూ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించిన రాహుల్.. హెయిర్ కట్‌తో పాటు గడ్డం, మీసాలను కత్తిరించుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో  ఉపన్యాసం కోసం మంగళవారం బ్రిటన్  చేరుకున్న రాహుల్.. న్యూలుక్‌లో కనిపించారు. విజిటింగ్ ఫెలో హోదాలో రాహుల్ కెంబ్రిడ్జ్‌లో ప్రసంగించనున్నారు. వారం రోజుల పాటు బ్రిటన్‌లో పర్యటిస్తారు.  

సాధారణంగా క్లీన్ షేవ్ చేసుకునే రాహుల్.. ఈసారి కొంచెం మీసాలు, గడ్డం ఉంచుకోవడంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్ర అసాంతం టీషర్ట్, ప్యాంట్‌నే ధరించిన కాంగ్రెస్ అగ్రనేత.. టిప్‌టాప్‌గా సూట్ ధరించి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం అనే అంశంపై రాహుల్ ప్రసంగిస్తారని యూత్ కాంగ్రెస్ ట్వీట్‌ చేస్తూ.. కొత్త లుక్‌‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.