కరీంనగర్ లో పునరాలోచన సెంటర్

కరీంనగర్ లో పునరాలోచన సెంటర్
  • నిరుపయోగ వస్తువులను అప్పగించండి
  • మేయర్ యాదగిరి సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: నిరూపయోగమైన వస్తువుల ద్వారా రీయూజ్, రీసైకిల్ చేయడంతో పాటు నగరంలో చెత్తను తగ్గించేందుకు పునరాలోచన, త్రిబులార్ సెంటర్లను ఏర్పాటు చేశామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో పునరాలోచన దినం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి కార్యాలయం ఆవరణలో పునరాలోచన సెంటర్ ను ప్రారంభించారు.

అనంతరం పర్యావరణ పరిరక్షణ లో బాగంగా నగరపాలక సంస్థ వివిధ విభాగాల  అధికారులు, సానిటేషన్ సిబ్బంది, మెప్మా సిబ్బంది తో మేయర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నగరపాలక సంస్థ సేకరించిన దుస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు బ్యాగులు, చెప్పులు, ఎలక్టికల్ వస్తువులను రీయూజ్ రీసైకిల్ కోసం నిర్వహాకులకు అప్పగించారు. త్రిబులార్, పునరాలోచన సెంటర్ కు వచ్చిన వస్తువుల ద్వారా వచ్చిన డబ్బులను పేద ప్రజల సామాజిక కార్యాక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాలని ఎన్విరాల్ మెంట్, సానిటేషన్ అధికారులు ఆదేశించారు.

నగర ప్రజలు దుస్తులను, ప్లాస్టిక్ డబ్బాలు రేకులు, గ్లాస్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చెప్పులు లాంటి తదితర వస్తువులను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన త్రిబులార్, పునరాలోచన సెంటర్ లలో అప్పగించి సహాకరించాలని కోరారు. వీటిని నగరపాలక సంస్థ వాడుకునే పేద వారికి ఇవ్వడం తో పాటు మిగిలిన వాటిని రీసైకిల్ కోసం తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ పరిరక్షణ కాపాడినట్లు అవుతుందని వెల్లడించారు. రీయూజ్ రీసైకిల్ ద్వారా నగరంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు చెత్తను పూర్తి స్థాయిలో తగ్గించడం జరుగుతుందని తెలిపారు.

పనికి రాని వస్తువుల ఉపయోగంలో నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీస్కుంటుందని తెలిపారు.   రీయూజ్ రీసైకిల్ కోసం త్రిబులార్ పునరాలోచన సెంటర్ల లో అప్పగించేలా ప్రజలకు అవగాహన చేయాలన్నారు. వాటిని నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన సెంటర్ల లో అప్పగించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు తోటరాములు షరీపొద్దిన్, అదనపు కమీషనర్ స్వరూప రాణీ, డిప్యూటీ కమీషనర్ త్రయంభకేశ్వర్, అసిస్టెంట్ కమీషనర్ రాజేశ్వర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, సానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహార్ మెప్మా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.