నకిలీ బంగారం ను అమ్ముతూ మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన సూర్యాపేట  పోలీసులు.

నకిలీ బంగారం ను అమ్ముతూ మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన సూర్యాపేట  పోలీసులు.
  • జిల్లా పోలీసు కార్యాలయంలో  విలేకరుల సమావేశం నందు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్.


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-నకిలీ బంగారంను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు చెప్పారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన ధర్మ చంద్ కన్నయ్య లాల్ సోలంకి అలియాస్ ధర్మ, గుజరాత్ రాష్ట్రానికి చెందిన నారాయణ అలియాస్ నట్వర్ లను పట్టుకున్నామని, మహారాష్ట్రకు చెందిన మరొక నిందితుడు విష్ణు పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు.వారు ఎలా పట్టుబడ్డలని విషయాన్ని ఎస్పీ వివరించారు. బుధవారం ఉదయం అందాజ 10 గంటల సమయం లో డిఎస్పి నాగభూషణం  పర్యవేక్షణ లో సిఐ జి. రాజశేఖర్  ఆదేశానుసారం ఎస్సై యాకుబ్, క్రైమ్ హెడ్-కానిస్టేబుల్స్   జి. కృష్ణయ్య, జి. కరుణాకర్, జె. సైదులు, కానిస్టేబుల్లు కె. ఆనంద్, హోమ్ గార్డ్ సి హెచ్ మధు లు సూర్యాపేట పట్టణం లో పెట్రోలింగ్ చేయుచుండగా ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి పోలీస్ వాహనం ను చూసి పారిపోవుటకు  ప్రయత్నించారని తెలిపారు.వారిని పట్టుకొని చెక్ చేయగా వారి వద్ద కొన్ని పురాతన వెండి నాణేలు, నఖిలి బంగారు గొలుసు, కొన్ని బంగారు ఆభరణాలు ఉండగా పోలీస్ విచారణలో వారు అసలు విషయాలను వెల్లడించారని చెప్పారు. ఆగస్టు నెలలో ఖమ్మం వద్ద గల ఏదులాపురం లో నివాసం ఉండి అక్కడ ఇద్దరు నిందితులు కలిసి బ్యాగ్ ల వ్యాపారం చేస్తూ తెలంగాణ లోని పలు ప్రాంతాలలో సంచరిస్తూ అక్కడికి దగ్గరలో కాల్వ  ఒడ్డు సమీపం లో గల చికెన్ షాప్ నడుపుకునే  పిర్యాదురాలి తో   మొదటగా పరిచయం ఏర్పరచుకొని మెల్లగా వారితో "మాది మహారాస్ట్రా స్టేట్ అని,మేము రోడ్డు తొవ్వకం పని చేస్తామనీ, రోడ్డు త్రవ్వకాలలో మాకు కొన్ని పురాతన నాణేలు వాటితో పాటు  బంగారు గొలుసు  దొరికిందనీ,అది సుమారు 2 కిలోలు ఉంటుందనీ, మేము ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళుటకు చెక్ పోస్ట్ ల వద్ద ఇబ్బంది అవుతుందనీ,ఆ బంగారాన్ని ఇక్కడే తక్కువ రేటుకు అమ్మదలిచినామనీ నమ్మబలికారని ఎస్పీ వివరించారు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దనీ  పిల్లలపై ఒట్టు వేయించుకొని, ఒక బంగారు గుండు ను ఇచ్చి చెక్ చేయించుకోని నమ్మకం ఉంటేనే కొనండి అని నమ్మించి  వెళ్లారని ఎస్పీ చెప్పారు. వారు  ఇచ్చిన బంగారు గుండును చెక్ చేసి నిజం బంగారం అని తెలిసాక వారితో "మా దగ్గర రెండు కేజీల బంగారం ఉందనీ, మొత్తం పది లక్షలకు అమ్ముతాము డబ్బులు రెడీ చేసుకొని రండి అని  చెప్పడం జరిగిందన్నారు. పిర్యాదురాలు వద్ద డబ్బు లేక పోవటంతో తనవద్ద సుమారు 12 తులల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుపగా నిందితులు దానికి అంగీకరించి  పిర్యాదురాలిని  22-08-2023 రోజున ఉదయం 11: 30 గంటల సమయం లో ఖమ్మం నుండి సూర్యాపేటకు రమ్మని చెప్పి అక్కడ రహస్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళి 9 తులల బంగారు ఆభరణాలు, ఒక లక్ష డబ్బులు తీసుకొని వారి వద్ద ఉన్న మూట ను పిర్యాదురాలికి  ఇచ్చి వెంటనే అక్కడి నుండి  వెళ్లిపోయారనీ, పిర్యాదిరాలు ఆ మూట ని విప్పి చూడగా అందులో నకిలీ బంగారం పూసల దండలు కనిపించగా మోస పోయామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు, నిందితుల అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.

అత్యాశకు పోయి మోసపోవద్దనీ, సులభంగా డబ్బు సంపాదించడం అనేది కష్టం అనీ ,ప్రజలు ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దనీ ఎస్పీ సూచించారు. నిందితుల నుండి 9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీన పరచుకోవడం జరిగిందన్నారు. నిందితులపై క్రైమ్ నెంబర్ 358 అండర్ సెక్షన్ 420 ఇండియన్ పీనల్ కోడ్ 379 నమోదు చేశామన్నారు.ఈ కేసును చేదించిన పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పీ, అదనపు ఎస్పీ అభినందించారు. ఈ సమావేశం నందు అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డి.ఎస్.పి నాగభూషణం, సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్ , సిసిఎస్ సీఐ నాగార్జున, సూర్యాపేట పట్టణ ఎస్ఐ యాకూబ్, రవీందర్ లు, హెడ్ కానిస్టేబుళ్లు గొర్ల కృష్ణ కర్ణాకర్ సైదులు మధు సిబ్బంది పాల్గొన్నారు.