మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి  కార్మికులను ఆదుకోవాలి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి  కార్మికులను ఆదుకోవాలి

మునగాల ముద్ర:-మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు  గత వారం రోజు ల నుండి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహమునకు పలు సమస్యలతో కూడుకున్న వినతి పత్రమును అందజేసి నారు.శుక్రవారం ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులకు  ముఖ్యమంత్రి గౌరవ వేతనం ప్రకటించిన నాటి నుండి ఏరియార్స్ తో సహా కలిపి వేతనాలు చెల్లించాలని జీవో నెంబర్ 8 ప్రకారము పెంచిన వేతనాలు చెల్లించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోమధ్యాహ్న భోజన కార్మికులు ధనమ్మ,నాగమ్మ, లింగమ్మ, జె సైదమ్మ,సరోజన,స్వప్న, ప్రమీల, రంగమ్మ,చంద్రమ్మ, సైదమ్మ,పాపమ్మ,లక్ష్మి, సువార్త, సుభద్ర,మనీ, కోటమ్మ, నరసమ్మ,తదితరులు పాల్గొన్నారు.