బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్​జెండర్... దేశంలోనే తొలిసారి

బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్​జెండర్... దేశంలోనే తొలిసారి
India

కేరళ: దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్​జెండర్ జంట జియా పావల్ (21), జహాద్​ (23)​ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కేరళలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ జంట బుధవారం వెల్లడించింది. ​ప్రభుత్వ  కోయిక్కోడ్ మెడికల్​ కాలేజీలో వైద్యులు జహాద్ కు సిజేరియన్ చేశారు. బిడ్డ, జహాద్​క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. జహాద్​ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో  ‘బేబీ బంప్ ఫోటో’ షూట్ కూడా చేశారు. తాను ఎనిమిది నెలల గర్భవతినని ప్రపంచానికి తెలియజేశారు.

బిడ్డకు జన్మనివ్వాలనుకున్నానని వివరించారు. పావల్, జహాద్​మూడు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. లింగమార్పిడి ద్వారా వీరు ఒక్కటయ్యారు. జియా పావల్ శరీర పరివర్తన పొంది మహిళగా మారాడు. జహాద్ ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారింది. ఆడ నుంచి మగగా మారే క్రమంలో గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించకపోవడంతో జహాద్ గర్భం దాల్చేందుకు అవకాశం ఏర్పడింది.