అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు దగ్ధం

చిట్యాల ముద్ర న్యూస్: చిట్యాల మండలంలోని కైలాపూర్, గ్రామపంచాయతీ శివారులో గల శాంతినగర్, గ్రామంలో ప్రమాదవశత్తు దానవేన తిరుపతి, చింతనిప్పుల దశరథం, ఇండ్లు అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు శనివారం, మధ్యాహ్నం దానవేని తిరుపతి, ఇంట్లో ఒకేసారి మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వారు ,బయటకి పరుగు తీశారు. దీనితో పక్కనే ఉన్న చింత నిప్పుల దశరథ, ఇంటికి మంటలు వ్యాపించి అతని ఇల్లు కూడా పూర్తిగా కాళీ బూడిద అయ్యాది. ప్రమాదానికి విద్యుత్, కారణమని అనుకుంటున్నారు. ఇంట్లో ఉన్న పత్తి, బంగారం నగదు, బట్టలు, ఇంట్లోని సామాగ్రి ,మొత్తం కాళీ బూడిద అయి రెండు కుటుంబాలు వీధిన పడ్డాయి. కాలిన ఇండ్లలో ఒక్కొక్క ఇంటికి సుమారుగా 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధ్యతలు బోరున విలపిస్తున్నారు.

ఇండ్లు కాలిన బాధితులను పరామర్శించిన గండ్ర సత్యనారాయణ
శాంతినగర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోగా సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు. నిరాశ్రయులైన కుటుంబాలను ప్రభుత్వం నుండి అన్నివిధాలా ఆదుకోవాలని ఫోన్లో అధికారులను కోరినారు. ఇల్లు కాలిపోయిన బాధ్యులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.అయన వెంట జిల్లా నాయకులు, చింతకుంటరామయ్యపల్లి గ్రామ సర్పంచ్ మోకిరాల మధువంశీ కృష్ణ, తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.