గురుకుల కొలువులు కొట్టిన వనితలు 

గురుకుల కొలువులు కొట్టిన వనితలు 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  సారంగాపూర్ మండలం  పెంబట్ల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు గురుగుల ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన ఏనుగుర్తి దివ్య, బాదినేని శిరీషలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టిజిటి బయాలజికల్ సైన్స్ విభాగంలో  2023 సంవత్సరంలో జరిగిన గురుకుల ఉద్యోగ పరీక్షలలో విజయం సాధించి ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారు. గ్రామంలో ఇద్దరు మహిళలు ఎంపిక అయి పలువురికి ఆదర్శంగా నిలిచారని గ్రామస్తులు అభినందించారు