ధర్మపురికి కొప్పుల గుడ్ బై చెప్పి చొప్పదండి బరిలో నిలిచేనా ?

ధర్మపురికి కొప్పుల గుడ్ బై చెప్పి చొప్పదండి బరిలో నిలిచేనా ?

చొప్పదండిలో కొప్పుల అంతర్గత సర్వే వెనుక అంతర్యం ఏమిటి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈ సారి జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికార బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో భారి మార్పులు కనబడే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ, అభ్యర్థులు అంతర్గతంగా చేయిస్తున్న సర్వేలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ధర్మపురి నియోజక వర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి 2009 ఉప ఎన్నికలు, 2010, 2014, 2018 సాధారణ ఎన్నికలలో నాలుగుసార్లు గెలుపొందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈసారి నియోజక వర్గాన్ని మార్చాలని బావిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ  అధిష్టానం చేయించిన సర్వేలు, స్థానిక నాయకుల అసమ్మతి రాగాలఫై చొప్పదండి, రామగుండం నియోజక వర్గాలలో అభ్యర్థులు సుంకే రవి శంకర్, కోరుకంటి చందర్ లఫై వ్యతిరేకత వచ్చింది.

 కరీంనగర్ లోని ప్రతిమ హోటల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ లు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తొ పాటు, నియోజకవర్గ ముఖ్యనేతలతొ సమావేశం నిర్వహించారు. ఒకరిద్దరు మినహా ద్వితీయ శ్రేణి నాయకులు రవి శంకర్ కు మరోసారి టికెట్ ఇవ్వొద్దని, ఇస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాహాటంగానే తేల్చి చెప్పారు. అటు రామగుండంలో కోరుకంటి చందర్ కు టికెట్ ఇవ్వవద్దని పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు సమావేశాలు నిర్వహించి అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ రెండు నియోజక వర్గాలఫై అధిష్టానం సర్వే చేయించగా వారిద్దరికి నియోజక వర్గంలో వ్యతేరేకత కనిపించినట్లు నివేదికలు వెళ్ళాయి. 

అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ ను రామగుండం లేదా చొప్పదండి నియోజక వర్గం నుంచి పోటి చేయాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. రామగుండం కోరుకంటి చందర్ తన శిష్యుడే అయినందున అయనను పక్కన పెట్టి అక్కడ పోటి చేయడం ఇష్టం లేని కొప్పుల ఈశ్వర్ ఈ మధ్యనే చొప్పదండి నియోజకవర్గంలో తాను పోటి చేస్తే ఎలా ఉంటది అనే అంశంఫై సర్వే చేయించుకున్నారు.  ఈ విషయం ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కు తెలువగా తనవారే తనను వెన్ను పోటు పొడుస్తున్నారని సహచరుల ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ రాకను నియోజక వర్గంలో బిఆర్ ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఓటర్లు కూడా స్వాగతిస్తున్నట్లు అధిష్టానానికి సంకేతాలు పంపారు. అయితే సర్వే చేయించుకున్న మంత్రి మాత్రం తాను ఇదే చివరిసారిగా ఎమ్మెల్యేకు పోటి చేస్తానని, అదికూడా ధర్మపురి నుంచే అవకాశం కల్పించాలని సియం కేసిఆర్ ను కోరినట్లు సమాచారం. ఒక వేల కొప్పుల ఈశ్వర్ చొప్పందండికి వెళ్తే ధర్మపురి అభ్యర్థి ఎవరు అనేది కూడా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న . కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుంచి పోటి చేస్తారా లేక చొప్పదండి నుంచి పోటి చేస్తారా ... ఈ మధ్య చర్చ జరుగుతున్నట్లు ఎమ్మెల్యే బరినుంచి తప్పుకొని ఎంపికి పోటి చేస్తారో వేచి చూడాలి.