గుండాల మండలంలో బతుకమ్మ ఉత్సవాలు

గుండాల మండలంలో బతుకమ్మ ఉత్సవాలు

గుండాల అక్టోబర్ 14 (ముద్ర న్యూస్):మండలంలో వివిధ గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయా గ్రామాలలో గ్రామ సమీపంలో పాఠశాలలు చెరువు కాళీ ప్రదేశాలలో గ్రామపంచాయతీ నుండి బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాట్లు చేశారు   రంగు రంగుల దీపాలతో బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా మహిళలు బతుకమ్మలు రంగు రంగు పూలతో  బతుకమ్మ పేర్చుకొని మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడి పాడి చెరువులో వదిలారు.ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఈ సందర్భంగా,మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.