కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి  ఉంది: ప్రధాని మోదీ

కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి  ఉంది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ  పరేడ్​ గ్రౌండ్​ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.  ప్రియమైన సోదరసోదరీమణులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు అని మొదలు పెట్టారు. భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న నగరానికి తిరుమల వెంకటేశ్వరస్వామికి కలిపే రైలును ప్రారంభించామన్నారు.  అభివృద్థి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు.    భారత్​ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించారు.    ఏపీ– తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్​ రైలు ప్రవేశపెట్టామన్నారు.     రూ.11 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు.   

కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి  ఉందన్నారు.  దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశామన్నారు.  ఒకే రోజు 13 ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రారంభించామన్నారు.   హైదరాబాద్​–బెంగళూరు అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాం. మౌలిక వసతుల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామన్నారు. డిజిటల్​ లాదేవీల ద్వారా వ్యవహారాలు నడుపుతున్నామన్నారు. ఇంతకుముందు వీటిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని కుటుంబ పాలన చేసేవారు భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా కేంద్ర పథకాలు ఆలస్యమవుతున్నాయి.