నీరు పోసి మొక్కను బ్రతికించుకుందాం - ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

నీరు పోసి మొక్కను బ్రతికించుకుందాం - ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
  • నినాదాలతో హోరెత్తిన సూర్యాపేట జిల్లా
  • గ్రామాలలో మున్సిపాలిటీలలో ప్రత్యేక కార్యక్రమాలు
  • స్వీప్  లో భాగంగా పలు కార్యక్రమాలు
  • వర్షా బావ పరిస్థితి నుండి మొక్కలను కాపాడుదాం మొక్కలను బతికించుకుందాం
  • జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: నీరు పోసి మొక్కను బ్రతికించు కొందాం -ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతో  సూర్యాపేటలోని భవిత జూనియర్ కళాశాల విద్యార్థులు, మెప్మా స్వయం సహాయక సంఘాలు, రిసోర్స్ పర్సన్ లతో  నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ప్రారంభించారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు విలువ తెలియాలి, ఓటు వేయడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని, 95% ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం ద్వారా ఉత్తమమైన పాలకులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రతి పౌరునికి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మొక్కలను మరచిపోకుండా నీరు పోసే విధంగా ఒక వారం పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునివ్వడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో కమిషనర్, తాసిల్దార్, ఎంపీడీవోలు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, ఏపీవోలు ,ఐకెపి ,సిబ్బంది అన్ని మున్సిపాలిటీలలో గ్రామాలలో మొక్కలకు నీళ్లు పోసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు . జిల్లాలో 7రోజులు ప్రత్యేక ప్రణాళికతో పలు అహగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.  ప్రతి ఒక్కరూ మొక్కలను బతికించడానికి సన్నద్ధం కావాలన్నారు. అనంతరం విద్యార్థినులచే మానవహారం నిర్వహించి,అనంతరం నీరు పోసి మొక్కను బ్రతికించుకుంటాం- ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని  కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి డి పి ఆర్ ఓ ఏ రమేష్ కుమార్ మెప్మా పీడీ రమేష్ నాయక్ భవిత జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మారం వెంకట్ రెడ్డి మున్సిపల్ అధికారులు ఎండి గౌసుద్దీన్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ శ్రవణ్ కుమార్  డి ఐ ఈ మల్లేశం పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీరు పోసి మొక్కను బ్రతికించుకుందాం- ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. కలెక్టరేట్లో నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కలెక్టరేట్లోని మొక్కలకు నీళ్లు పోసి అనంతరం పెద్ద ఎత్తున నీరు పోసి మొక్కను బ్రతికించుకుందాం -ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కిరణ్ కుమార్,డీఎఫ్ఓ సతీష్ కుమార్ ,హార్టికల్చర్ అధికారి శ్రీధర్, ఏవో సుదర్శన్ రెడ్డి ,జెడ్పీ సీఈవో సురేష్, డిఎస్ఓ, వ్యవసాయ అధికారి రామారావు నాయక్ ,సిపిఓ వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య ,పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.