బస్‌ షెల్టర్‌ లేక ప్రయాణికుల అవస్థ

బస్‌ షెల్టర్‌ లేక ప్రయాణికుల అవస్థ
  • కళగానే మిగులుతున్న రేగొండ బస్ స్టాప్ నిర్మాణం
  • పట్టించుకోని నాయకులు 

ముద్ర న్యూస్ రేగొండ : రేగొండ మండలంలోని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని స్థానికులు  ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హన్మకొండ, భూపాలపల్లి, వైపు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్‌లో కంటే పోలీస్‌స్టేషన్‌ ప్రక్కన ఉన్న రిక్వెస్ట్‌ స్టాప్‌ గల చెట్టు వద్ద నుంచే బస్‌లలో ఎక్కుతుంటారు. రోజూ వందలాది మంది ఎక్కే ఈ స్టాప్‌ వద్ద ఎలాంటి షెల్టర్‌ లేకపోవడంతో ఎండకు, వానకు తడుస్తూ ప్రయాణికులు తీవ్ర అవస్థ పడుతున్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ స్టాప్‌ వద్ద బస్‌ షెల్టర్‌ నిర్మించాలని చాలా రోజులుగా ప్రతిపాదనలు ఉన్నా ఇంతవరకు అది సాధ్యపడలేదు. స్థానిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్మాణం లచేపడుతామని పలువురు వాగ్దానాలు చేసినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని తక్షణం షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోనే రేగొండ మండలం అతి పెద్ద మండలంగా పెరు గాంచిన.అభివృద్ధి లో మాత్రం సున్యంగా ఉంటోంది ఎంతో మంది నాయకులు మారుతున్న మండల రూపురేఖలు మరడంలేదు.నాలుగు మండలాలకు చేరువగా ఉన్న నాయకుల దృష్టిలో చిన్న చూపే కనిపిస్తోంది.ప్రధాన రహదారిపై ఎంతో మంది ప్రజా ప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు కనిపట్టించుకొనే నాధుడు కరువయ్యారు.ప్రతి రోజు దూర ప్రయాణాలు చేసే మహిళలు మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండ కాలం కావడంతో ఎండలో బస్సుల కోసం ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్నారు.మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేక ఎక్కడికి వెళ్లలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు బస్ స్టాప్ నిర్మాణం కోసం శ్రద్ద చూపలని ప్రయాణికులు వేడుకుంటున్నారు