రానున్న కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం.. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

రానున్న కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం.. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

తుంగతుర్తి ముద్ర: రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే విజయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వడ్డేపల్లి రవి అన్నారు .ఈ సందర్భంగా తుంగతుర్తి లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లాలని అధిష్టానం సూచించిందని అందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో సోమవారం నుండి ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతులకు ఏకకాలం రెండు లక్షల రుణమాఫీ ,500 కు గ్యాస్ సిలిండర్, చేయూత కింద పెన్షన్ 4000, ఇండ్లకు ఐదు లక్షలు, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, లేనట్లయితే నిరుద్యోగులకు 4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, ఆరోగ్యశ్రీ కి 5 లక్షల వరకు వైద్యం అందిస్తామని అన్నారు.

తుంగతుర్తి అభివృద్ధి టిఆర్ఎస్ పాలనలో పూర్తిగా కుంటుపడిందని అన్నారు. వంద పడకల ఆసుపత్రి ఎక్కడ? అని ప్రశ్నించారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన రుద్రమదేవి చెరువు రిజర్వాయర్ హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు నియోజకవర్గంలో రోడ్లన్నీ పాడై రవాణాకు ఇబ్బందికరంగా మారిన పట్టించుకునే వారే లేరని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ నుండే అవుతుందని అన్నారు .సోమవారం నుండి ప్రారంభం అయ్యే ఇంటింటా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొ నాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుడిగంటి రమేష్ ,గుజ్జ నరేందర్  తదితరులు పాల్గొన్నారు.