మొదటి ఓటు జగదీశ్ రెడ్డి దే

మొదటి ఓటు జగదీశ్ రెడ్డి దే
  • ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనం
  • పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • మన సమస్యలను ప్రతిభింబిస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను ఎన్నుకోవాలి
  • ఓటు వేయకపోవడం అంటే మనల్ని మనం నష్టం చేసుకోవడమే
  • ఖమ్మం - నల్లగొండ - వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా సూర్యాపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
  • 673 మంది ఓటర్ల లో మొదటి ఓటు వేసి ఆదర్శప్రాయంగా నిలిచిన జగదీష్ రెడ్డి

సూర్యాపేట ముద్ర ప్రతినిధి: ఓటు హక్కు వినియోగించుకోవడమనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని, ఓటు వేయకపోవడం మనల్ని మనము మోసం చేసుకోవడమే అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వరంగల్- నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్ ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ ప్రారంభ సమయం 8 గంటలకే 457 వ బూతు వద్దకు చేరుకున్న ఆయన బూతులో 673 మంది ఓటర్లు ఉండగా మొదటి ఓటు వేసి యువ ఆదర్శప్రాయంగా నిలిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన సమస్యలను ప్రతిభింబిస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను ఎన్నుకోవాలి అని కోరారు.పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు.