ఘనంగా సుపరిపాలన దినోత్సవ వేడుకలు..

ఘనంగా సుపరిపాలన దినోత్సవ వేడుకలు..

ముద్ర, రుద్రoగి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పదవ రోజున సుపరిపాలన దినోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పాలనా స్వరూపాన్ని మార్చివేశారని అన్నారు.

ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేస్తుందని అన్నారు.గతంలో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని,నూతన జిల్లాలు పెరగడంతో పాలన సౌలభ్యం పెరిగిందని అన్నారు.జిల్లాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం పరిపాలనకు ప్రభుత్వానికి సులభమైందన్నారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్,వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య,సెస్ డైరెక్టర్ ఆకులు గంగారాం, మండల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు