నటి దివ్య ప్రభకు వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

నటి దివ్య ప్రభకు వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ విమానంలో వేధింపులకు గురయ్యారు. మంగళవారం ముంబాయి నుంచి కొచ్చికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆమె ప్రయాణించారు. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న ఓ వ్యక్తి తనను తాకుతూ వేధింపులకు గురి చేసినట్లు దివ్యప్రభ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఈ మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి విమానంలో విండో సీటు కోసం తనతో వాగ్వాదానికి దిగాడని, తరచూ భౌతికంగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.