జీవో నెంబర్​ 1 పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

జీవో నెంబర్​ 1 పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

జీవో నెంబర్​ 1 పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేవరకు జీవోపై స్టే కొనసాగేలా ఆదేశించాలని హైకోర్టును కోరండి అని చెప్పిన సుప్రీం కోర్టు. తమ ఆర్డర్​ హైకోర్టు డివిజన్​ బెంచ్​కు చూపించాలన్న సీజేఐ ధర్మాసనం. త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టుకు ఆదేశం ఇచ్చింది. జనవరి 24న జీవో నెం.1 పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన వెకేషన్​ బెంచ్​. దానిపై విచారణ జరిపిన డివిజన్​ బెంచ్​. వెకేషన్​ బెంచ్​ మధ్యంతర ఉత్తర్వులు తొలగిస్తున్నట్లు మౌఖికంగా చెప్పినా లిఖిలపూర్వకంగా తెలపని డివిజన్​ బెంచ్. అందుకే తుది తీర్పు వచ్చేవరకు స్టే విధిస్తూ వెకేషన్​ బెంచ్​ ఉత్తర్వులు ఇచ్చింది. వెకేషన్​ బెంచ్​ ఉత్తర్వులు అమలు చేసేలా డివిజన్​ బెంచ్​ను కోరాలని పిటిషనర్​కు సీజేఐ ధర్మాసనం సూచించింది.