కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసల పర్వం - పటేల్ రమేష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసల పర్వం - పటేల్ రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు బలంగా వేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు (ఎస్) మండలం  ఏపూర్ గ్రామం లో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి  అవిరే వెంకన్న, యాసారపు మహేష్  ఆధ్వర్యంలో  30 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్ గెలుపు తథ్యం అని జోష్యం చెప్పారు. కాంగ్రెస్లో చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు యాసారపు రవి యాదవ్, ఎరుకల మధుసూదన్, కొమ్ము  సైదులు యాదవ్, ఏరుకొండ నాగరాజు, గుండ్లపల్లి బాలు, గుండ్లపెళ్లి నవీన్, కొమ్ము గణేష్ యాదవ్, గుండ్లపల్లి  శ్రీకాంత్  వీరితో పాటు దాదాపు 30 కుటుంబాల వారు ఉన్నారన్నారు .

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మహాలక్ష్మి పధకం తో మహిళాభ్యున్నతి, రైతు భరోసా రైతన్నను రాజును చేసేందుకు గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగు ఇందిరమ్మ సొంతయింటి కల, యువ వికాసం తో యువతలో ఆత్మవిశ్వాసం, చేయూతతో వృద్ధుల శ్వాసల్లో ఆసరాలతో పేదవాడికి ఈ ఆరు పధకాలు ఆరోప్రాణంగా నిలుస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీకి,స్థానిక నాయకులు పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్న తరుణంలో  అధికార పార్టీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ లో చేరికలు జోరుగా సాగుతున్నాయి అని అన్నారు.

అధికార పార్టీ నాయకులను బిత్తర పోయేలా చేస్తున్నాయని ,అందుకే ఇలాంటి అవినీతి అరాచక పాలన పాలిస్తున్న బీ ఆర్ఎస్ పార్టీని బొందపెట్టి రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నుండి స్థానిక నాయకుడైన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూర్యాపేట ప్రజలు కంకణం కట్టుకుని ఎదురుచూస్తున్నారని పటేల్ రమేష్ రెడ్డి భీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోదల రంగారెడ్డి గట్టు శ్రీనివాస్ షఫీ ఉల్లా ముదిరెడ్డి రమణారెడ్డి ఎల్గూరి రాంబాబు స్వామి నాయుడు,ఫారుక్ యాట ఉపేందర్ నామ అరుణ్ పిల్లల ఉపేందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు