మండల పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి

మండల పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన కూస రవి బోయినిపల్లి పోలీస్ స్టేషన్ కి వెల్లి పోలీస్ అధికారులకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ మరియు (జీడి) జనరల్ డైరీకి సంబంధించిన సమాచారం కింద దరఖాస్తు చేసినారు.ప్రస్తుతం బోయినిపల్లి పోలీస్ అధికారులు రిసీవుడు కాపీ మేము ఇవ్వలేము,ఇది పర్సనల్ అని చెప్పేసి గంటల తరబడి స్టేషన్ లోనే వెయిట్ చేపించారు.రిజిస్టర్ పోస్ట్ చెయమని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మామిడి మహేందర్ ఎస్సై గత పది రోజుల నుండి డ్యూటీకి రావట్లేదు. వేములవాడ సి.ఐ కృష్ణకుమార్ కు కూడా ఫోన్ చేయగా అలాంటి జి.డి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేము అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అలాగే వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారికి కూడా ఫోన్ చేసి వివరణ కోరగా మీ దగ్గరలో ఉన్న బోయినిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ ని కలిసి రిసీవ్డ్ తీసుకోమని చెప్పి,నేను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేశారు.ఈ విషయంపై నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తానని బాధితులు తెలిపారు.