ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేగంగా మలుపులు తిరుగుతున్న తుంగతుర్తి రాజకీయం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేగంగా మలుపులు తిరుగుతున్న తుంగతుర్తి రాజకీయం
  • అధికార పార్టీని ఓడిస్తానన్న ఏపూరి సోమన్న నేడు అదే పార్టీ గెలుపు కోసం బిఆర్ఎస్ లోకి
  • ముద్ర పత్రిక ముందే చెప్పింది బిఆర్ఎస్ లోకి ఏపూరి వెళతారని
  • ఏపూరి చేరికతో బలం పుంజుకోనున్న బి.ఆర్.ఎస్ 
  • నిన్నటి వరకు ఉప్పు నిప్పు నేడుభాయ్ భాయ్ గా మారనున్న ఎమ్మెల్యే ఏపూరి

తుంగతుర్తి ముద్ర: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయ చక్రం వేగంగా మలుపులు తిరుగుతోంది .మలుపులు తిరుగుతున్న రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే  బిఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది .ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న వైయస్సార్ టిపిని వీడి  బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించడంతో తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? .ఏపూరి సోమన్న బి ఆర్ ఎస్ పార్టీలో చేరవచ్చు అని ముద్ర పత్రిక ఇదివరకే . నేడు అదే మాట వాస్తవమైంది . సోమన్న టిఆర్ఎస్ పార్టీకి అదనపు బలంగా . బి.ఆర్.ఎస్ పార్టీ నుండి మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ రాజీనామా చేసి బలమైన సామాజిక వర్గం ఉన్న తన సామాజిక వర్గ ఓట్లను చీల్చుతానని బహిరంగంగానే ప్రకటించారు. కాగా అదే సామాజిక వర్గానికి చెందిన ఏపూరి సోమన్న  బిఆర్ఎస్ పార్టీలోకి రావడంతో సామేల్ తో జరిగే నష్టాన్ని సునాయాసంగా అధిగమించవచ్చని మాట వినవస్తోంది. నిన్న మొన్నటి వరకు తన వాడి వేడి విమర్శనాస్త్రాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేను అడుగడుగున విమర్శించిన ఏపూరి సోమన్న ఎమ్మెల్యేతో సయోధ్యకుదురుచుకుంటారా .ఇరువురు కలిసి పని చేస్తారా? అనే ప్రశ్నలు టిఆర్ఎస్ శ్రేణుల్లో మెదులుతున్న మాట వాస్తవం. తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సుపరిచితమైన పేరు ఏపూరి సోమన్నది కావడం గమనార్హం. ఉద్యమ కాలంలో గ్రామ గ్రామాన తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన ఏపూరికి కొంతమేర కార్యకర్తల బలం ఉంది. నేడు తన బలాన్ని బలగాన్ని స్థానిక శాసనసభ్యులు గెలుపు కోసం పూర్తిస్థాయిలో వినియోగిస్తే బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో పటిష్ట స్థాయికి చేరుకోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గం లోని 9 మండలాల్లో ఎదురులేని శక్తిగా తన బలాన్ని పెంచుకున్న ఎమ్మెల్యేకు ఏపూరి సోమన్న రాక అదనపు బలమే అని చెప్పవచ్చు.నేటి వరకు విపక్షంగా ఉన్న ఏపూరి సోమన్న ఎన్నికల బరిలో నిలిచి అధికార పార్టీని ఓడిస్తానని చెప్పి తిరిగి అదే గూటికి చేరడం నేడు అదే అధికార పార్టీని గెలిపించాల్సి రావడం చూస్తే రాజకీయ చక్రం ఎంత వేగంగా తిరుగుతుందో అర్థం అవుతుంది .రానున్న కాలంలో కాంగ్రెస్ ఆశావహుల్లో ఎవరో ఒకరికి టికెట్ వస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటో వారు ఎవరెవరి అండకు చేరుతారు ఎవరి గెలుపు కోసం పని చేస్తారు వేచి చూడాల్సిందే.