ఈ నెలాఖరిలోగా చెరువులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు - హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

ఈ నెలాఖరిలోగా చెరువులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు - హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

నేరేడుచర్ల, సెప్టెంబర్ 22 ముద్ర న్యూస్ : సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావులను ఆధారం చేసుకొని పండిస్తున్న పంటలను కాపాడేందుకు ఈనెల చివరిలోపు సాగర్ జలాలను  విడుదల చేసి చెరువులను నింపాలని   రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని పలు గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాన్పహాడ్ రోడ్డులోనిపర్టిలేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగర్ జలాశయానికి నీరు చేరకపోవడంతో సాగు నీటి విడుదల సాధ్యం కాలేదన్నారు. ఈ నేపధ్యంలో బోర్లు, బావులు ఆధారం చేసుకోని పలువురు రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని, పంటల పునర్జీవం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ ఈఎన్సీతో మాట్లాడి ఈనెల చివరిలోగా సాగర్ నీటిని విడుల చేసి ఎడమ కాల్వ పరిధిలోని చెరువులన్ని నింపేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంతరం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. గత 18 సార్లు సాగర్ నీటిని విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వరునుడి కురణ లభించక పోవడంతో ఈసారి సాగర్ జలశాయానికి నీరు చేరకపోయినప్పటికీ ప్రతి పక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలందరికీ వాతావరణ పరిస్థితులు కారణంగానే సాగు నీటి విడుదల సాధ్యం కాలేదనే విషయం తెలుసునన్నారు. వాతావరణం అనుకూలించనప్పటికీ 24గంటల ఉచిత విద్యుత్తో ఘననీయంగా పంటల సాగు పెరిగిందన్నారు.

రైతులను ఏ విధంగా అదుకోవాలో సీఎం కేసీఆరికి తెలిసినంత ఏ నాయకుడికి తెలియదన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం తప్పించే నాయకుడు మన రాష్ట్రానికి సీఎంగా ఉండడం మన అదృష్టమన్నారు. గణనాధుడి కృపతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీదర్, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జీ కొణతం సత్యనారాయణ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్ బాబు, మత్స్యశాఖ చైర్మన్ పేరబోయిన వీరయ్య, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండయ్య, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్ బాష, సాయి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కట్టా కళావతి, మాజీ మండలాధ్యక్షుడు సోమిరెడ్డి, ఉత్సవ కమిటీ నిర్వహాకులు పోలా విశ్వనాధం, జనసేన జిల్లా అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరావు, నాయకులు కుంకు శ్రీను, వల్లంశెట్ల రమేశ్బాబు, ఆకారపు వెంకటేశ్వర్లు, నక్కా రమాదేవి, సులువ యాదగిరి, ఇంజమూరు రాములు, నారాయణ, శ్రీను, రాజేష్ తదితరులు ఉన్నారు.