స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రత పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రత పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లా వ్యవసాయ మార్కెట్ గోదాంలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ల, కౌంటింగ్ కేంద్రాల భద్రతను ఎస్పీ రాహుల్ హెగ్డే  రిటర్నింగ్ అధికారులు, పోలీసు నోడల్ అధికారులతో కలిసి పరిశీలించారు.  నిబంధనల ప్రకారం బారికెడ్ లు ఏర్పాటు చేస్తున్నామని, అధికారుల పర్యవేక్షణలో పూర్తి రక్షణ బందోబస్తు ఉంటుందని తెలిపినారు. నిబంధనల మేరకు కేంద్ర బలగాల ఆర్ముడ్ టీమ్ లను విధుల్లో ఉంచాం అని ఎస్పీ  తెలిపినారు. సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశాం అని తెలిపినారు. జిల్లా ఎన్నికల అధికారి, సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకున్నాం అని  తెలిపినారు. ఎస్పీ  వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రంహచారి,  డిఎస్పీలు  నాగభూషణం, రవి, తాశిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ మహేష్, స్థానిక సీఐ రాజశేఖర్ ఎస్ఐలు ఉన్నారు.