ఉత్సాహంగా 2 కే రన్‌

ఉత్సాహంగా 2 కే రన్‌

  • జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్‌‌ శివలింగయ్య
  • కలిసికట్టుగా దశాబ్ది ఉత్సవాలు

ముద్ర ప్రతినిధి, జనగామ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జనగామ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 2 కే రన్‌ ఉత్సాహంగా సాగింది. కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య పచ్చ జెండా ఊపి ప్రారంభించిన రన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మొదలై నెహ్రూ పార్క్‌, ఆర్టీసీ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంటకు చేరుకుంది. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్‌‌ మాట్లాడుతూ ఎంతో మంది పోరాట ఫలితంగా తెలంగాణ ఆర్భవించిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి పదో ఏట అడిగిన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో అందరూ కలిసి కట్టుగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. కాగా, 2 కే రన్‌ సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహించిన పోలీసు శాఖను కలెక్టర్‌‌ అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్ సింగ్ (రెవెన్యూ), డీసీపీ సీతారాం, డీఏవో వినోద్‌కుమార్‌‌, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, ఏసీపీ దేవేందర్ రెడ్డి, జనగామ సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌, జనగామ ఎస్సైలు రుక్మాచారి, సృజన్‌, అరుణ్‌, తరిగొప్పుల, నర్మెట, బచ్చన్నపేట ఎస్సైలు నరేశ్‌, అనిల్‌,  పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులతో పాటు బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, జనగామ పట్టణ పీఎస్‌ పరిధిలోని విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.