అన్నోన్ ప్రాపర్టీ కింద  70 స్క్రాప్ వాహనాలు వేలం

అన్నోన్ ప్రాపర్టీ కింద  70 స్క్రాప్ వాహనాలు వేలం
  •  జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అన్నోన్ ప్రాపర్టీ కింద జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్న  70 వాహనాలపై కేసు నమోదు చేయడం జరిగిందని, గత ఆరు నెలల నుండి పై వాహనాల గురించి ఎవరు రానందున అన్నోన్ స్క్రాప్  (Unclaimed/ Abandoned Vehicles )ప్రాపర్టీగా పరిగణించి వేలం వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో ఆగస్టు 8న   ఉదయం 10 గంటలకు వేలం వేస్తున్నట్లు ఎస్పీ  తెలిపారు. బహిరంగవేలంలో పాల్గొనలనుకునేవారు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు ( కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొందినది) వెంట తీసుకొని రావలని  ఇతర వివరాలకు 8247870840 నంబర్ కి సంప్రదించాలని సూచించారు.