BIG BREAKING - ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేసిన కొడుకు

BIG BREAKING - ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేసిన కొడుకు

ముద్ర,తెలంగాణ :- మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామంతపూర్‌లో దారుణం శనివారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం తల్లిని కుమారుడు చంపాడు. భార్యతో కలిసి తల్లి సుగుణమ్మను కుమారుడు అనిల్ చంపాడు. తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మాలని కుమారుడు అనిల్ కోరాడు. తల్లి ఒప్పుకోకపోవడంతో స్నేహితుడు, భార్యతో కలిసి ఆమెను హత్య చేశాడు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.