కులవృత్తల పేరుతో సీఎం కుట్ర

కులవృత్తల పేరుతో సీఎం కుట్ర
  • బీసీ బంధు సైడ్ ట్రాక్ చేసేందుకే రూ.లక్ష స్కీం
  • ఎవల్యూషన్ వేదిక జనగామ జిల్లా అధ్యక్షుడు బిట్ల గణేష్

ముద్ర ప్రతినిధి, జనగామ: బీసీ కులాలకు బీసీ బంధు ప్రకటించకుండా.. సైడ్ ట్రాక్ చేయడం కోసమే కుల వృత్తుల వారికి లక్ష రూపాయలంటూ సీఎం కేసీఆర్ కుట్ర చేస్తన్నారని ఎవల్యూషన్ వేదిక జనగామ జిల్లా అధ్యక్షుడు బిట్ల గణేష్ ఆరోపించారు. శనివారం రోజున జనగామ పట్టణంలోని వైష్ణవి గార్డెన్ లో వేదిక జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాముకుంట్ల చందు  ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మాట్లాడుతూ బీసీలకు వెంటనే బీసీబంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్యాక్స్ ద్వారా వినతిపత్రం పంపారు. కార్యక్రమంలో తోట సురేందర్, నామాల రాజు, చిందాల వెంకటేష్, మచ్చ వరలక్ష్మి, నాచు అరుణ, పుట్ట పద్మ, కొయ్యడ దశరథ, వల్లాల భాను, రావుల శ్రీనివాస్, కె.సంతోషి, ఆర్.రజిత, రజియా ఇట్టబోయిన మధు పాల్గొన్నారు.