‘మణిపూర్’ ఘటనపై క్రైస్తవుల శాంతి ర్యాలీ

‘మణిపూర్’ ఘటనపై క్రైస్తవుల శాంతి ర్యాలీ

ముద్ర ప్రతిననిధి, జనగామ : మణిపూర్ హింస ఘటనలకు నిరసనగా జిల్లాలోని అన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు జనగామలో మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఉనృపుర సెంటినరీ బ్యాప్టిస్ట్‌ చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ మణిపూర్‌‌లో జరుగుతున్న ఘటనలతో దేశం సిగ్గుతో తల దించుకుంటుందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వాతంత్రపు హక్కును కాలరాస్తూ కొన్ని రాయకీయ శక్తులు దేశం మొత్తంగా పని చేస్తున్నాయని ఆరోపించారు.

మణిపూర్‌‌ నేరస్తులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీ అనంతరం క్రైస్తవుల హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనగామ ఉనృపుర సెంటినరీ వారి బ్యాప్టిస్ట్ చర్చి ప్రెసిడెంట్ కర్రో జాన్, సెక్రటరీ బక్క శ్రీను, పసుల ఏబేల్‌, కార్యవర్గ సభ్యులు, చర్చి మెంబెర్లు, స్థానిక సంఘ కాపరి రెవ పి.ఫిలిస్, జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవ కొంగరి మోజస్ కుమార్, ఫీల్డ్ ప్రెసిడెంట్ రెవ శాగ దేవదానం, రెవ నల్ల జాన్, రెవ. నర్సింగరావు, ఫాదర్ ప్రభాకర్, బున్నారెడ్డి, రెవ.నవీన్ కుమార్, డా. ఇన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.