కుమ్మక్కయ్యారు.. వ్యాపారాలు దక్కించుకున్నారు...

కుమ్మక్కయ్యారు.. వ్యాపారాలు దక్కించుకున్నారు...
  • కొండగట్టులో పలు వ్యాపారాల నిర్వహణకు టెండర్లు 
  • కుమ్మక్కయ్.. వ్యాపారాలు దక్కించుకున్న గుత్తేదారులు..
  • పర్సంటేజీల రూపంలో చేతులు మారిన లక్షలు..?
  • అంజన్న ఆదాయానికి భారీ గండి


ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి  ఆలయంలో పలు వ్యాపారాల నిర్వహణకు గురువారం అధికారులు టెండర్లు నిర్వహించారు. ఏడాది కాలపరిమితితో.. 1) కొబ్బరికాయలు అమ్ముకోను, 2) కొబ్బరికాయలు ప్రొగు చేసుకోను, 3) గాజులు-ఆట,ప్లాస్టిక్ వస్తువులు, 4) పూలు-పండ్లు, 5) పుట్నాలు-ప్యాలాలు, 6) కిరాణం, 7) శీతలపానియాలు,వాటర్- ఐస్క్రీమ్స్, 8) టెంట్ హౌస్, 9) హోటల్, 10) ఫోటో స్టూడియో,11) వంటచెరుకు అమ్ముకొను, 12) పాదరక్షలు భద్రపరుచుకొను, 13) స్నానము గదులు-మరుగుదొడ్లు, 14) లాకర్ రూమ్, తదితర వాటికి ఆలయ అధికారులు ఈ టెండర్, సిల్డ్, బహిరంగ వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేష్, స్పెషల్ అధికారి రవికిషన్, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, సూపరిండేoట్ సునీల్, సిబ్బంది చారీ, మాజీ డైరెక్టర్లు ప్రవీణ్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.


 అందరూ.. కుమ్మక్కయ్యారు..?
వ్యాపారాల నిర్వహణ దక్కించుకోవడానికి గూత్తేదారులoదరూ ఒక్కటయ్యారు.. ముందుగానే మాట్లాడుకున్న వారు తమకు అనుకూలంగా టెండర్లు మల్చుకొని, వ్యాపారాలు దక్కించుకున్నారు. దాదాపు 30 లక్షలు పర్సoటేజీల రూపంలో చేతులు మారినట్లు తెలిసింది. ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే అంజన్న ఆదాయానికి గండి పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దేవస్థానం పాట మొదలు పెట్టిన అధికారులు ఎక్కువ కాకున్నా కనీసం అక్కడి వరకు పాట తీసుకురాకపోవడంతో తక్కువ ధరలకే గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు.


 కొబ్బరికాయల టెండర్లో విభేదాలు..?
కొబ్బరికాయలు అమ్ముకునే టెండర్ విషయంలో వ్యాపారుల మధ్య విభేదాలు తలేత్తాయి.. అయితే ముందుగా కుమ్మక్కయిన గుత్తేదారులు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు. బహిరంగ వేలంలో హెచ్చుపాట అనంతరం అధికారులు సిల్డ్ టెండర్ ఓపెన్ చేశారు. అందులో కాoప్రమేజ్ అయిన వ్యక్తి బహిరంగ వేలంకు మించి ఎక్కువ అమౌంట్ కోడ్ చేయడంతో కొబ్బరికాయల అమ్ముకునే హక్కు పొందాడు. దాంతో అసలు ( కాoప్రమేజ్ చేసుకున్న) గుత్తేదారు గొడవకు దిగడంతో విబేధాలు తలేత్తాయి. వెంటనే పెద్ద మనుషులు జోక్యం చేసుకోని, హక్కు పొందిన వ్యక్తితో దుకాణంకు సంబంధం లేనట్లు పత్రం రాయించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా, టెండర్ల వ్యవహారంపై దేవాదాయ శాఖ స్పందించాలని పలువురు కోరుతున్నారు.


 పలు టెండర్లు వాయిదా...
గురువారం నిర్వహించిన టెండర్లలో సరైన పాట రానందున పూలు-పండ్లు, ఫోటో స్టూడియో, లాకర్ నిర్వహణ వాయిదా వేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మళ్ళీ తొందర్లోనే వీటికి టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.