మెట్పల్లి లో కాపర్ దొంగల అరెస్ట్

మెట్పల్లి లో కాపర్ దొంగల అరెస్ట్

మెట్ పల్లి, ముద్ర: మెట్పల్లి పట్టణం లోని వట్టి వాగు బ్రిడ్జి వద్ద గల సబ్ స్టేషన్ లో జూన్ 27న దాదాపు 6 లక్షల విలువైన 600 కేజీల కాపర్ వైర్ చోరి కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డి యస్ పి రవీంద్ర రెడ్డి తెలిపారు. అరెస్ట్ వివరాలను డి ఎస్ పి వెల్లడించారు. మెట్ పల్లి సి ఐ లక్ష్మినారాయణ ఎస్ఐ శ్యాంరాజ్ తన సిబ్బందితో బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తుండగా ఉదయం సమయం లో మెట్పల్లి ఎస్ఐ శ్యాంరాజ్ తన సిబ్బందితో కలిసి అరపేట శివారు లో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా నిందితులు మందమర్రి కి చెందిన హన్మంతు,నరేష్ లు మరో నిందితుడు పవన్ కి చెందిగా టవేర కార్ లో మళ్ళి మెట్పల్లి చుట్టుపక్కల గ్రామాలలో కాపర్ దొంగతనం చేయడానికి ముందస్తుగా రెక్కి నిర్వహించడానికి వస్తు పోలీస్ లను చూసి బయపడి పారిపోయే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఎస్ఐ శ్యాంరాజ్ వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు పై నేరాన్ని ఒప్పుకొన్నారు. వారి వద్ద కాపర్ కొనుగోలు చేసిన రమేష్ ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రూ . 6 లక్షల విలువైన 600 కిలోల కాపర్ రికవరి చేచారు. నిందితులు మంచిర్యాల జిల్లా జైపూర్ దగ్గర కూడా దాదాపు 400కిలోల కాపర్ ని దొంగలించి నిందితుడు రమేష్ కి అమ్మి వచ్చిన డబ్బును వారు సమానంగా పంచుకుని వారి జల్సాలకి ఖర్చు చేసినట్టు పోలీస్ విచారణలో తిలినట్లు డీఎస్పీ తెలిపారు. ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగ, పరారిలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులు రాజు పవన్ లను త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తామని పోలీస్ లు తెలిపారు.అతి తక్కువ సమయంలో కాపర్ వైర్ దొంగతనం కేసును ఛేదించిన మెట్పల్లి సి ఐ కె. లక్ష్మినరయణ, మెట్పల్లి ఎస్ఐ శ్యాంరాజ్ బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.