సామాన్యుడి మంసాహారానికి రెక్కలు

సామాన్యుడి మంసాహారానికి రెక్కలు

 కొండెక్కిన కోడి ..

బ్రాయిలర్ చికెన్ @ 320

ఈ ఏడాది అత్యధిక ధర ఇదే

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సామాన్యుడి మాంసాహారానికి రెక్కలు వచ్చాయి... మాంసాహారాల్లోకెల్లా చికెన్ ఎప్పుడు సామాన్యుడికి అందుబాటు ధరలోనే ఉంటుంది చేపలు, మేక, గొర్రెల మాంసాలతో పోల్చుకున్నట్లయితే. ప్రతి ఏడు రూపాయల రూ. 200 నుంచి రూ. 260 వరకు మాత్రమే చికెన్ ధరలు ఉంటుంటాయి. కానీ ఈసారి వేసవి తాపం, ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్రాయిలర్ కోళ్ల వ్యాపారులు కోళ్లను పెంచడం లేదు . కొందరు పెంచుతున్న వేడికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. బ్రాయిలర్ కోళ్ళు దొరుకక చికెన్ రెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా జగిత్యాల పట్టణంలో తోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ రేటు 300 నుంచి 320 వరకు పలికింది. ప్రతి రోజు చికెన్ రేటు వేరు వేరుగా ఉంటుంది.. ఎప్పటికప్పుడు ఆయా చికెన్ సంస్థలు చికెన్ రేట్లను ప్రకటిస్తూ ఉంటారు ఆ రేటుకు అనుగుణంగా చికెన్ అమ్మకాలు జరుపాలి.

ఆదివారం రెట్లు ఇలా ఉన్నాయి. ఫారం వద్ద కిలో లైవ్ కోడి ధర రూ. 168, అది రిటైలర్ అమ్మే ధర రూ.190, చికెన్ స్కిన్ తో రూ. 276, స్కిన్ లెస్ చికెన్ ధర కిలో రూ. 314 అమ్మాలని నిర్ణయించారు. సాధారణంగా చేపలు ధరలు రూ . 400 నుంచి రూ. 500 వరకు ఉండగా మేక, గొర్రెల మాంసము రూ. 600 నుంచి రూ.700 ఉంటుంది. చేపలు, మేక మాంసానికి ఎప్పుడు రేట్లు అధికంగా ఉండడంతో సామాన్యులు ఎక్కువగా చికెన్ వైపే ముగ్గు చూపుతారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ కార్మికులు పలు ఇటుక బట్టిలతో పాటు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తుంటారు. వీరు చేపలు, మేక, గొర్రెల మాంసంవైపు వెళ్ళకుండా ప్రతివారం చికెన్ కొనుగోలు చేస్తుంటారు. అయితే జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ రేట్ అధికంగా ఉండడంతో ప్రజలు చెప్పల మార్కెట్, మటన్ మార్కెట్ లో క్యూలు కట్టారు. దీంతో చికెన్ సెంటర్ లన్ని కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి.