తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌...

తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌...

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డిజిపి వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్ కు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేశాడు అగంతకుడు. వాట్సప్ డిపికి తెలంగాణ డిజిపి రవి గుప్తా ఫోటో ఉందని సమాచారం. వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారట. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని నమ్మించాడట అగంతకుడు.కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు డిమాండ్ చేశాడట అగంతకుడు. ఇక దీనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్నారు సైబర్ పోలీసులు. ఈ సంఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.