మాజీ ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావ్

ముద్ర, కోరుట్ల: అయ్యప్ప స్వామి పేరుతో రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి  జువ్వాడి నరసింగరావు సూచించారు. సోమవారం కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోరుట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు కోరుట్ల సాయి శ్రీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పీసరి అశోక్, సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నర్సింగ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు, మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి దేవున్ని కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారాలు తెరచి పెడితే బారాసా లో కెసిఆర్ కుటుంబ సభ్యులు కేవలం ముగ్గురే మిగిలిపోతారని కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయబోదని పేర్కొన్నారు. త్వరలో త్వరలో నియోజకవర్గంలో మున్సిపాలిటీలలో జరిగిన అవినీతి ద్వారా మున్సిపల్ పాలకవర్గం అవిశ్వాసం ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఎన్నిక అవుతారని స్పష్టం చేశారు. ఎవరైనా కర్మ సిద్ధాంతం నుండి తప్పించుకోలేరని 15 సంవత్సరాలలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన బారాస నాయకుల అవినీతిచిట్ట విప్పుతామని స్పష్టం చేశారు.

బారాస చిన్నస్థాయి కార్యకర్త నుండి ఎమ్మెల్యే వరకు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమంగా ప్రజాధనం ఇసుక మాఫియాతో కోట్లు గడిచారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్దే కానీ గత 15 సంవత్సరాల నుండి కోరుట్ల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అర్హులైన పేద వారందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మహిళా పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, కౌన్సిలర్లు సంగ లింగం, ఎంబెరి నాగభూషణ్, మాజీ కౌన్సిలర్ సోగ్రబి, కోరుట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం.ఎ. నయీమ్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉరుమడ్ల వెంకటి, నేమురి భూమయ్య, ఆడెపు మధు, ఎంబేరి సత్యనారాయణ, చెదలు సత్యనారాయణ, శ్రీరాముల అమరేందర్, పేట భాస్కర్, చిటిమెల్లి రంజిత్, మాసాపురం వెంకటేశ్వర్లు, మ్యాదరి లక్ష్మణ్, రాజేష్ తదితరులు ఉన్నారు.