గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
  • కక్ష సాధింపు చర్యలకు పాల్పడ వద్దు.
  • సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు


మోత్కూర్(ముద్ర న్యూస్) :గ్రామ పంచాయితీ కార్మికుల పట్ల, ప్రభుత్వం సానుకూలంగా  స్పందించి, వారి సమస్యలను పరిష్కరించాలని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ వద్దని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మోత్కూరు లో పంచాయితీ కార్మికులు మోకాళ్ళ పై నిలుచుని నిరసన తెలియజేస్తూ, ధర్నా చేస్తున్న వారికి సీపీఎం పార్టీ మద్దతు తెలియచేయడం జరిగింది. అనంతరం ఆయన  మాట్లాడుతూ గ్రామ పంచాయితీలో పారిశుద్ధ్య కార్మికులు, స్విపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషయన్ లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు గా, వివిధ కేటగిరీలో,  విధులు  నిర్వహిస్తునారని,  వారికి  ప్రభుత్వం  ఇచ్చిన  హామీలు  అమలు  కావడం లేదని తెలిపారు.  గ్రామ పంచాయితీ ల్లో,   జీఓ నెంబర్ 51 ద్వారా, మల్టీ పర్పస్ విధానాన్ని తెచ్చి, కేటగిరీలను  రద్దు చేసి, రకరకాల  పనులను చేయించటం వల్ల కార్మికులు ప్రమాదాలకు  గురౌతూ, ప్రాణాలు  కోల్పోతున్నారని ఆందోళన  వ్యక్తం  చేశారు. దీంతో,  కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చాల ఇబ్బందులు పడుతున్నారని, పంచాయితీలకు  జనాభాను బట్టి బడ్జెట్ లో   నిధులు కేటాయిస్తామని,  కొత్త చట్టాలను రూపొందించి పటిష్టం చేసి,  వేతనాలు పెంచడం తోపాటు,  వారికి ప్రత్యేక తరహాలో,  నిర్ణయాత్మక మైన,  ఉద్యోగ భద్రత కల్పిస్తామని,  ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.  జీఓ 60 ప్రకారం  నిర్ణయించిన వేతనాలు  అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు, అనేక  విజ్ఞప్తులు  చేసిన పట్టించుకోక  పోవడంతో, వారి సమస్యలను పరిష్కరించాలని, కోరుతూ,  కార్మికులు ఈ నెల 6 నుండి సమ్మె చేస్తున్నారని, వారిపై,  ప్రభుత్వం   కక్ష సాధింపులకు పాల్పడకుండా, సమస్యలపై,  ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.  గ్రామాల వీధులను శుభ్రం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని  కాపాడుతుంటే, పంచాయితీ కార్మికుల పట్ల, ప్రభుత్వం  వివక్షత  చూపడం తగదని,  ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, వారి సమస్యలను పరిష్కారించి,  మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చెయ్యాలని,  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్ర అనిల్ కుమార్, మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, పనుగుల రమేష్, పిట్టల చంద్రయ్య, పంచాయితీ కార్మికులు, సూరారం నాగయ్య, కొంపల్లి అంజయ్య, వేముల సుదర్శన్, పరుష రాములు, బగ్గయ్య, దనుంజయ్య, మల్లేష్, స్వామి, శైలజ, వెంకన్న, మర్రిపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.