ఓదెల మండలంలో హాథ్ సే హాథ్ జోడో 

ఓదెల మండలంలో హాథ్ సే హాథ్ జోడో 
  • గడప గడపకు కాంగ్రెస్ పార్టీ - పల్లే పల్లెకు విజ్జన్న కార్యక్రమం 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-నియోజకవర్గంలోని ఓదెల  మండలంలో హాథ్ సే హాథ్ జోడో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ - పల్లే పల్లెకు విజ్జన్న కార్యక్రమం  గ్రామంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలను టీపీసీసీ ఉపాధ్యక్షులు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రజలకు వివరించారు. 

ఈ సంధర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ..

తుక్కుగూడలో జరిగిన విజయభేరి బహిరంగ సభలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గ్యారంటీ 6 పథకాలు ప్రకటించారని, 
మహాలక్ష్మి పథకం  ద్వారాప్రయాణం66 మహిళా సోదరీమణులకు ప్రతి నెలా రూ. 2500 అందిస్తాం.. మరియు ఉచిత బస్సు ప్రయాణం..
రైతు భరోసా పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు  ప్రతి ఏటా రూ. 15,000 /- మరియు వ్యవసాయ కూలీలకు రూ. 12,000/- మరియు వరి పంటలు రూ. 500/- బోనస్ అందించి ప్రతీ రైతుకు ఏకకాలంలో రూ. 2లక్షల రుణ మాఫీ..
గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తాం..
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్సి కులస్థులకు రూ. 6 లక్షలతో పాటు ఇంటి స్థలాన్ని అందిస్తాం..
ఉద్యమకారులను 250 చ.గ ఇంటి స్థలం అందిస్తాం..
చేయూత పథకం ద్వార రూ. 4000/- నెలవారీ పింఛను అందిస్తామని, ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యవసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.