పంటలు ఎండిపోతున్నాయి....

పంటలు ఎండిపోతున్నాయి....
  • 24 గంటల కరెంట్ అయినా ఇవ్వండి....
  • ఎడమ కాల్వకు నీళ్లయిన వదలండి
  • సిపిఐ ధనుంజయ నాయుడు డిమాండ్

ముద్ర నేరేడుచర్ల:పొట్ట దశలో పంటలు ఎండిపోతున్నాయని... పంటలు కాపాడి రైతాంగాన్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని 24 గంటల కరెంటు అయినా ఇవ్వండి... లేదా సాగర్ ఎడమకాలువకు నీళ్లు అయినా వదలండి అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు... తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

గురువారం నాడు నేరేడుచర్ల లోని సిపిఐ పార్టీ కార్యాలయం ప్రజా భవన్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ...

పొలాలు పొట్ట దశకు చేరుకోవడం వల్ల నీటి అవసరం ఇప్పుడు అధికంగా ఉంటుందని అందువల్ల ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని సుమారు 525 అడుగుల మేర సాగర్ జలాశయంలో నీరు ఉన్నదని, గతంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 500 అడుగుల మాత్రమే నీరు ఉన్నప్పటికీ నీరు  విడుదల చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.రైతు ఈతి బాధలను పట్టించుకోలేని ప్రజా ప్రతినిధులు బాధ్యతలలో కొనసాగడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు.. సక్రమంగా కరెంటు సరఫరా చేయాలని కోరిన రైతాంగం పై అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలంతో దూషించిన వారు,  ఓట్లు అడుగుతారని, గృహ లక్ష్మీ పథకంలో ఇల్లు కడిగిన మహిళను అసభ్య పదాలతో దూషించిన వారికి, కరెంటు అడిగితే దూషించిన వారికి ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గత నెల ఆఖరికి సాగర్ ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన వారు అట్టి విషయాన్ని మరిచిపోయారా అని ఆయన అన్నారు.ఏది ఏమైనా తక్షణమే రైతన్న యొక్క కష్టాలను తీర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించక 15 రోజులు దాటిందని ఆయన ఎక్కడ ఉన్నా బయటకు వచ్చి రైతాంగం యొక్క దీనస్థితిని గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన వెంట ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, రైత్సంగం మండలాధ్యక్షుడు కత్తి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు  రావుల సత్యం, మండల సిపిఐ కార్యదర్శి యల్లబోయిన సింహాద్రి ఉన్నారు