బీసీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటనతో బిజెపిలోకి వలసలు.

బీసీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటనతో బిజెపిలోకి వలసలు.
  • బిజెపిలోకి చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు.
  • బీసీలకు పెద్దపెట్టవేస్తున్న బిజెపి.
  • బిజెపితోనే అభివృద్ధి సాధ్యం:  సంకినేని.
  • సూర్యాపేట, తాళ్ల ఖమ్మం పహాడ్, పెన్ పహాడ్, వల్లభాపురం గ్రామాల నుంచి భారీగా బీజేపీ లో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-బిసి వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో బిజెపి పార్టీకి ఆకర్షతులై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామాలు చేసి బిజెపిలో చేరుతున్నారని సూర్యాపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం సూర్యాపేట, తాళ్ల ఖమ్మం పహాడ్, పెన్ పహాడ్, వల్లభాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు,  బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఏకైక పార్టీ బిజెపి అని ఆయన అన్నారు బిజెపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీలను వీడి బిజెపిలో చేరుతున్నారని అన్నారు.

సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్నికల నాటికి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఖాళీ అవుతాయని ఆయన అన్నారు. అనంతరం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలకు బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తదుపరి ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పెన్ పహాడ్ మండలం మాచవరం గ్రామం నుంచి సంకినేని వెంకటేశ్వరరావు ప్రచారం గురువారం ప్రారంభించారు మాచారం గ్రామస్తులు మంగళహారతులతో సంకినేకి స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు దుఃఖాన్ని మన్మధ రెడ్డి కర్నాటి కిషన్ సలిగంటి వీరేంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు