కల్వకుంట్ల వారిపై ప్రేమతోనే కోరుట్లలో పోటీ...

కల్వకుంట్ల వారిపై ప్రేమతోనే కోరుట్లలో పోటీ...
  • కోరుట్ల లో బీజేపి జెండా ఎగరడం ఖాయం..
  • రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం..
  • నిజామాబాద్ ఎంపీ అరవింద్

మెట్‌పల్లి ముద్ర:- నాకు కల్వకుంట్ల వాళ్ళ పై ప్రేమ ఉన్నది కాబట్టి కోరుట్ల లో పోటీ చేస్తున్నానని కోరుట్ల గడ్డపై బీజేపి జెండా ఎగరడం ఖాయం అని. తెలంగాణ రాష్ట్రం లో బీజేపి ప్రభుత్వం ఏర్పడుతుందని నిజామాబాద్ ఎంపీ బీజేపి కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన తర్వాత మొదటిసారిగా కోరుట్లలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.మొదటి సారిగా కోరుట్ల కు వచ్చిన ఆయనను బీజేపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అరవింద్ సమక్షంలో బీజేపి లో చేరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ. తమ వద్ద కూడా అయస్కాంతం ఉందని, దాంతో తప్పక తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాజకీయంలో మార్పునకు కోరుట్ల నియోజకవర్గం నాంది కాబోతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణకు సెంటర్ పాయింట్ కోరుట్ల అన్నారు. పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ గెలిచి తెలంగాణకే ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామన్నారు.

రోడ్డు రోలర్ గుర్తుపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లి భంగపడ్డారని చెప్పారు. రోడ్డు రోలర్ గుర్తుకు, కారు గుర్తుకు తేడా తెలియడానికే కేసీఆర్ కు కంటి వెలుగు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి.. పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో 31 స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన తిండి లేదని, బాలికలకు ప్రత్యేకమైన వాష్రూమ్స్ లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కల్వకుంట్ల వారంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే కోరుట్లలో కల్వకుంట్ల వారి పని పట్టడానికే నియోజకవర్గానికి వచ్చానని అన్నారు. 60 కిలో మీటర్ల దూరంలో నుండి వచ్చి కోరుట్ల లో పోటీ చేస్తున్న వ్యక్తి స్థానికుడు కాదని ఆయన ఎమ్ అభివృద్ధి చేస్తాడని స్థానిక ఎమ్మెల్యే అంటున్నాడని. ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో పోటీ చేస్తే స్థానికుడు ఎట్లా అయితాడు అని ప్రశ్నించారు. కేటీఆర్ స్థానికుడు అయితే నేను స్థానికుడను అవుతానని. ఆయన అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చేస్తా అన్నారు. కల్వకుంట్ల  కుటుంబాన్ని ఓడించేందుకు కంకణం కట్టుకున్నానని అందుకోసమే ఆర్మూర్ నియోజకవర్గస్థానాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్ స్థానాన్ని డబ్బులు కోసం అమ్ముకున్నానని ఎవరో ఒక వ్యక్తి అంటున్నాడని. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్మూర్ స్థానాన్ని వదులుకోవడానికి కారణాలు చెబుతానని. అక్కడ కూడా జీవన్ రెడ్డిని ఓడించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు కోరుట్ల వెళుతున్న అరవింద్ కు మెట్‌పల్లి కి చెందిన బీజేపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.వట్టి వాగు వద్ద మహాలక్ష్మి దేవాలయం లో అరవింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారయణ, డాక్టర్ రఘు,సురభి నవీన్, బోగా శ్రావణి, డాక్టర్ సునీత వెంకట్, చెట్లపల్లి మీన, సుఖేందర్ గౌడ్, గుంటుక సదాశివ తదితరులు పాల్గొన్నారు.