పాత పర్మిషన్ లు కొత్త నిర్మాణాలు..

పాత పర్మిషన్ లు కొత్త నిర్మాణాలు..
  • పిర్యాదు చేసిన పట్టించుకోని వైనం
  • వార్త కథనాలతో అధికారులు, ప్రజా ప్రతినిధుల కు కాసులు..

మెట్‌పల్లి ముద్ర:- పట్టణంలో అక్రమ కట్టడాల జోరు కొనసాగుతోంది.పట్టణంలో 26 వార్డులు ఉండగా ప్రతి వార్డులో పది నూతన భవన నిర్మాణాలు చేపడితే అందులో ఐదు అక్రమ నిర్మాణాలు. ఉంటున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల పై పిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.పట్టణంలో కొందరు పాత పర్మిషన్ లతో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అధికారులకు ఆ నిర్మాణాల విషయం తెలిసినప్పటికీ ముడుపులతో లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు పాత భవనాలను కూల్చి వేసి అదే స్థానంలో ఎలాంటి అనుమతి లేకుండా నూతన  భవనం నిర్మిస్తుండగా మరి కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కు పర్మిషన్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా మరో ప్లోర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పట్టణ మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో మూడు నూతన వార్డులు ఏర్పడగ ఆ వార్డులో గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్ గడువు ముగిసినప్పటికీ అదే పర్మిషన్ తో నూతనంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ వార్డులో ఒక వ్యక్తి గ్రామ పంచాయతీ పర్మిషన్ తో ఉన్న పాత ఇంటిని కూల్చి వేసి అదే స్థలంలో మున్సిపల్ అనుమతులు లేకుండా నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. మరో వార్డులో అదే గ్రామ పంచాయతీ పర్మిషన్ తో పాత భవనం పై మరో అంతస్తు నిర్మిస్తున్నారు. ఇలా ప్రతి వార్డులో అక్రమ  నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మాత్రం పిర్యాదులు వస్తె నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టక ముందే స్థలాన్ని పరిశీలించి పర్మిషన్ ఇవ్వవలసిన అధికారులు నిర్మాణాలు జరుగుతుండగా పిర్యాదులు వస్తె పనులు జరుగుతున్నప్పుడే పర్మిషన్ ను అప్లై చేసుకోవాలని యజమానులతో చెప్పి. ముడుపులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ లు ఇస్తున్నట్లు సమాచారం. 

ప్రజా ప్రతినిది భర్తకు ముడుపులు...?

కాగా ఓ వార్డులో అక్రమ కట్టడం నిర్మించేందుకు ఓ ప్రజా ప్రతినిది భర్తకు బారి మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు తెలుస్తుంది. ఆ నిర్మాణం పై మున్సిపల్ కార్యాలయంలో ఓ వ్యక్తి పిర్యాదు చేయగా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆ ఇంటి నిర్మాణ దారుడు ఆ ప్రజా ప్రతినిది భర్తను ఇంత పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించిన నోటీసులు ఎందుకు ఇచ్చారు అని నిలదీస్తే కొద్ది రోజులు పని నిలిపివేయాలని నిర్మాణం వైపు ఏ అధికారి రాకుండా చూసుకుంటాను అని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కట్టడం పై టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను "ముద్ర" రిపోర్టర్ వివరణ కోరగా ఆ వ్యక్తి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని పర్మిషన్ వస్తె పనులు చేసుకోవాలని సూచించినట్లు తెలపడం కొసమెరుపు.