ఆర్ఓబి ప్రోటోకాల్ లొల్లి

ఆర్ఓబి ప్రోటోకాల్ లొల్లి

శంకుస్థాపన ఆహ్వానంపై బండి ఆగ్రహం 
కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు : మేయర్
ఎంపీకి సమాచారం అందించాం: కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: తీగల గుట్టపల్లి లో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం ప్రోటోకాల్ వివాదానికి దారితీస్తుంది. 126 కోట్ల కేంద్రం నిధులతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు ది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు ప్రోటోకాల్ వివాదం బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య అగ్గిరాజేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంశంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింతో పూర్తిస్థాయి కేంద్రం నిధులతోనే ఆర్ఓబి నిర్మిస్తున్నట్లు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి పార్లమెంటు సభ్యులను పిలవడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. నేను స్థానికంగా లేని సమయంలో కావాలని స్థానిక మంత్రి ముహూర్తం ఖరారు చేశాడని మండిపడుతున్నారు. 

ఇదిలా ఉండగా ముందస్తుగానే పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కి సమాచారం అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి 126 కోట్లు మంజూరు చేసిందని ఇది అభివృద్ధిలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధిలో భాగమే అని వై సునీల్  రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అదనంగా మరో 28 కోట్లు మంజూరు చేసినట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. ప్రోటోకాల్ విషయం అధికారులు చూసుకుంటారని కొట్టిపారేస్తున్నారు. కావాలనే బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.