Oscars awards 2023: అరుదైన సత్కారం

Oscars awards 2023: అరుదైన సత్కారం

ఊహించినట్టుగానే నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని అర్జించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. దీంతో తెలుగు పరిశ్రమ ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. ఎప్పటినుంచో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభిస్తుందనేటువంటి నమ్మకాన్ని తెలుగు చిత్ర ప్రముఖులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాట తెలుగు నాటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల వేడుకకు ముందు కూడా ఈ పాట మీద హాలీవుడ్ నటీమణులు చేసిన నృత్యం హాలీవుడ్ను ఒక ఊపు ఊపింది.

అదే ఊపులో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని విశ్వవేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని సగర్వంగా చాటింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖలే కాకుండా, భారతీయ సినీ ప్రముఖులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, దేశ ప్రధాని నరేంద్ర అనేకమంది ప్రముఖులు రాజమౌళి కీరవాణికి అభినందనలు తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మీద కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.