ఫంక్షనల్ పర్టికల్స్ నిర్వహణలో జిల్లా పోలీస్ పనితీరు బేష్.

ఫంక్షనల్ పర్టికల్స్ నిర్వహణలో జిల్లా పోలీస్ పనితీరు బేష్.
  • సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే  
  • బదిలీపై వెళ్తున్న ఎస్పి రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ కి వీడ్కోలు సమావేశం, నూతన ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ కి స్వాగత సమావేశం నిర్వహించిన జిల్లా పోలీసు సిబ్బంది.
  • బదిలీపై వెళుతున్న ఎస్పీని సన్మానించిన జిల్లా నూతన ఎస్పి  రాహుల్ హెగ్డే

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట జిల్లా ఎస్పీగా రెండు సంవత్సరాల కాలం జిల్లా ప్రజలకు పోలీస్ సేవలను అందించి బదిలీ అయిన ఎస్పీ రాజేంద్రప్రసాద్ ని జిల్లా పోలీస్ శాఖ తరపున నూతన ఎస్పీ రాహుల్ హెగ్డే సన్మానించి అభినందనలు తెలిపినారు, సూర్యాపేట జిల్లా పోలీస్ సిబ్బంది పని విభాగాల నిర్వహణలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతున్నారని, దీనికోసం ఎస్పీ రాజేంద్రప్రసాద్  అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతూ పని చేయించారని అన్నారు. నూతన ఎస్పీని సిబ్బంది సన్మానించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలిపినారు.

బదిలీ పై వెళ్తున్న ఎస్పి రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాల కాలంలో జిల్లాతో జిల్లా ప్రజలతో జిల్లా పోలీసు సిబ్బందితో అవినాభావ సంబంధం ఏర్పడిందని ఇది జీవిత కాలం గుర్తుంచుకునే మంచి అనుభవమని తెలిపారు. సిబ్బంది అందరూ ఉత్సాహంగా బాధ్యతతో పనిచేశారని, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లాలో అనేక క్లిష్ట పరిస్థితులను జిల్లా పోలీస్ శాఖ అధిగమించిందని, పర్యవేక్షణ లోపం లేకుండా విధులు నిర్వర్తించడం చాలా సంతృప్తిని ఇచ్చిందని, దురాజుపల్లి జాతర, మేళ్లచెరువు జాతర, VIP  బందోబస్తు, ఆర్మీ ర్యాలీ, పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, ఫంక్షన్ వర్టికల్ నిర్వహణ లాంటి విధుల నిర్వహణ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

జిల్లా పోలీస్ సిబ్బంది ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను రథంపై ఊరేగించి, గజమాలతో సన్మానించడం జరిగినది. రాజేంద్ర ప్రసాద్ దంపతులను సన్మానించడం జరిగినది, ఎస్పి  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం, రవి, ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, మహేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగార్జున, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, అశోక్, శివ శంకర్, బ్రహ్మ మురారి, రాము, రామలింగారెడ్డి, వీర రాఘవులు, ఆర్ ఐ నారాయణరాజు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సంఘం సభ్యులు, ఎస్ఐలు, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.