టీపీసీసీ అధ్యక్షురాలిగా సీతక్క..?

టీపీసీసీ అధ్యక్షురాలిగా సీతక్క..?

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కి నూతన సారథిని నియమించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున పార్టీ పదవికి మరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది.  పార్టీ అధిష్టాన వర్గం నూతన పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం కోసం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత... కొత్త పిసిసి అధ్యక్షులు రాబోతున్నారట.

ఈ ఈ పదవికి మంత్రి సీతక్క పేరు తెరపైకి వచ్చినట్లు సమచారం. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరునే హైకమాండ్‌కు సూచించనున్నట్లు సమాచారం. సీతక్కతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కీ‌ గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీకి విధేయుడుగా పేరుందిన అద్దంకి దయాకర్‌ల పేర్లు సైతం వినిపిస్తున్నాయి.