బేడ బుడిగే  జంగాలకు గుర్తింపు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం

బేడ బుడిగే  జంగాలకు గుర్తింపు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం

 బాణాల వెంకన్న
ముద్ర ప్రతినిధి సూర్యాపేట

బేడ బుడగ జంగాలకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని సూర్యాపేట జిల్లా బేడ బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు బాణాల వెంకన్న అన్నారు .ఆదివారం సూర్యాపేట మండలం జమున నగర్ లో  బేడ బుడగ జంగాల మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడ బుడగ జంగాల ఓట్లను వేయించుకుంటున్న నాయకులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఎక్కడా కూడా బేడ బుడగ జంగాల కోసం పోరాటం చేసే నాయకుడు లేరన్నారు. మాల ,మాదిగ ల తర్వాత మూడవ స్థానంలో ఉన్న బేడ బుడగ జంగాలను ఆదరించే నాధుడు లేడన్నారు. బేడ బుడగ జంగాల నివసించే ప్రాంతాల్లో సైతం సరైన వసతులు ప్రభుత్వం కల్పించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లకు మాత్రమే బేడ బుడగ జంగాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. మా బేడ బుడగ జంగాల ఓట్లు తెలంగాణలో 25 లక్షల ఓట్లు  ఉన్నాయన్నారు. 

బుర్రకథలు, బాగోతాలు, తోలు బొమ్మలు ఇలాంటి కలలు ఎన్నో వేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నా కళాకారులకు గుర్తింపు లేకుండా పోయిం దన్నారు. కళాకారుల కార్డులు ఉన్నా కూడా పెన్షన్లు దక్కే పరిస్థితి లేదన్నారు.  బేడ బుడిగ జంగాల సూర్యాపేట మండలం అధ్యక్షుడిగా వాన రాశి వెంకన్న, ఉపాధ్యక్షుడిగా రేవల్లి వెంకన్న, గ్రామ అధ్యక్షుడిగా పురాణపు సుధాకర్ ఉపాధ్యక్షుడిగా మోతే జానయ్య ఎన్నికైనట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వానరాశి లింగయ్య, వెంకన్న ,మూత సైదులు ,పురాణపు అంజయ్య , ఎదురుగట్ల లక్ష్మయ్య  ఎదురుగట్ల భద్రయ్య, లింగయ్య ,ఇస్తారు  పర్వతం ఎల్లయ్య ,గోలయ్య , అశోకు తదితరులు ఉన్నారు.